
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థతో ఎంతోమంది ప్రజలకు మేలు జరుగుతోందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం జగన్‌ను అభినందించారు. (Modi Applauds AP CM Jagan)
వీటి ద్వారా ప్రజలకు సేవలు త్వరగా అందుతున్నాయని.. ఎలప్పుడూ వారికి అండగా నిలుస్తోందని అన్నారు. ఈ విధానాన్ని మిగతా రాష్ట్రాలు సైతం అమలు చేస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా నివారణకు అమలు చేస్తున్న ప్రణాళికలపై సీఎం జగన్.. మోదీతో చర్చించారు. కోవిడ్ నివారణకు కేంద్రం ఇస్తున్న అన్ని మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు.
Also Read:
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
దేశంలోనే తొలిసారిగా.. వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు..
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..
ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..
ఏపీ విద్యార్ధులకు గమనిక.. పీజీ ఈసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి..