దేశంలోనే తొలిసారిగా.. వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు..

దేశంలో తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. […]

దేశంలోనే తొలిసారిగా.. వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు..
Follow us

|

Updated on: Sep 24, 2020 | 12:00 AM

దేశంలో తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటిని ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్(మ్యూటేషన్) చేయించుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. (CM KCR Review Meeting)

ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్..

రాష్ట్రంలో ఇకపై ఏ తరహా రిజిస్ట్రేషన్ అయినా ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు.. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్‌ను తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇళ్ళ స్థలాలను పూర్తి స్తాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు పేదలకు కలుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కోన్నారు.

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..