ఐరాసా వేదికపై పాక్ పైనే ఫోకస్.. మోదీ టార్గెట్..

| Edited By:

Sep 27, 2019 | 9:24 AM

ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్నమోదీ.. ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలలో పాల్గొని తన గళాన్ని వినిపించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐరాస వేదికపై మోదీ ప్రసంగించనుండటం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఆయన తన ప్రసంగంలో పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికే ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఇక మోదీ ప్రసంగించిన తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగిస్తారు. దీంతో కశ్మీర్ అంశం పై […]

ఐరాసా వేదికపై పాక్ పైనే ఫోకస్.. మోదీ టార్గెట్..
Follow us on

ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్నమోదీ.. ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలలో పాల్గొని తన గళాన్ని వినిపించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐరాస వేదికపై మోదీ ప్రసంగించనుండటం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఆయన తన ప్రసంగంలో పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికే ప్రయత్నిస్తారని తెలుస్తోంది.

ఇక మోదీ ప్రసంగించిన తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగిస్తారు. దీంతో కశ్మీర్ అంశం పై ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రసంగంలో ఆర్టికల్‌ 370 రద్దు, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని ఖండించడానికి భారత్‌ తన హక్కును ఉపయోగించుకుంటుందని భారత ప్రతినిధులు తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. అవకాశం దొరికిన ప్రతిసారి పాక్ కశ్మీర్ అంశాన్నే లేవనెత్తుతోంది. అయితే కశ్మీర్ అంశం ముగిసిపోయిందని.. పీవోకే పైనే చర్చలు జరపాలని భారత్ స్పష్టం చేస్తోంది. మూడేళ్ల క్రితం జరిగిన ఐరాస 70వ వార్షిక సమావేశాల్లో అభివృద్ధి, పర్యవరణ సంరక్షణకు ప్రపంచదేశాలన్నీ ప్రాధాన్యం ఇస్తూ.. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ఈ నేపథ్యంలో అజెండా 2030ని అమలు చేయడంలో భారత్ పోషించే పాత్ర గురించి ప్రధాని మోదీ వివరించే అవకాశం ఉంది.