దేవతల మొక్కను నాటిన ప్రధాని మోడీ

|

Aug 05, 2020 | 12:34 PM

ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను మోదీ నాటారు. అంతకు ముందు.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు వచ్చారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో...

దేవతల మొక్కను నాటిన ప్రధాని మోడీ
Follow us on

ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను మోదీ నాటారు. అంతకు ముందు.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు వచ్చారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ఆయనకు ప్రొటోకాల్‌ ప్రకారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి సీఎం యోగితో కలిసి హనుమన్‌ గడీ ఆలయానికి ఆయన వెళ్లారు.  ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం యోగితో కలిసి హనుమాన్ గడిలో తొలి పూజను నిర్వహించారు.  స్వామి వారికి హారతి ఇచ్చారు. అనంతరం వెడి కిరీటం దరించిన ప్రధాని మోడీ.. ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అక్కడి నుంచి ఆయన రామజన్మభూమికి తరలివెళ్లారు. అక్కడే సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి దేవతల మొక్కగా పేరున్న పారిజాతం మొక్కను ఆలయం ప్రాంగణంలో నాటారు.