పిల్లల్ని కనడంపై స్పందించిన అనుష్క శ‌ర్మ‌

భార‌త క్రికెట్ టీమ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య ఇటీవలే తండ్రిగా ప్ర‌మోట్ అయ్యారు. అప్పటి నుంచి విరుష్క జోడీ గురించే చ‌ర్చ సాగుతుంది. వీరు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారో అంటూ నెటిజన్లు ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు.

పిల్లల్ని కనడంపై స్పందించిన అనుష్క శ‌ర్మ‌

Anushka Sharma about having a baby : భార‌త క్రికెట్ టీమ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య ఇటీవలే తండ్రిగా ప్ర‌మోట్ అయ్యారు. అప్పటి నుంచి విరుష్క జోడీ గురించే చ‌ర్చ సాగుతుంది. వీరు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారో అంటూ నెటిజన్లు ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ విష‌యంపై మీమ్స్ కూడా గుప్పిస్తున్నారు. ఇలా బ‌య‌ట మాట్లాడ‌టం వేస్ట్ అనుకున్నాడో ఏమో ఓ నెటిజన్​, ఇన్​స్టా లైవ్​లో ఏకంగా అనుష్కనే ఈ విష‌యం గురించి అడిగేశాడు. ఈ ప్రశ్నకు అదే రీతిలో ఆన్స‌రిచ్చింది ఈ బాలీవుడ్ భామ. విరుష్క దంపతులకు 2017లో పెళ్లైంది.

“మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని పిల్లల గురించే ప్ర‌శ్నిస్తున్నారా?” అన్న నెటిజన్ ప్రశ్నకు​, “లేదు, కేవలం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే దీని గురించి చ‌ర్చించుకుంటున్నారు “ అని అనుష్క బ‌దులిచ్చింది.

“కోహ్లీ నుంచి ఎలాంటి హెల్ఫ్ తీసుకుంటూ ఉంటారు” అని మరో నెటిజన్​ ప్ర‌శ్నించగా,  “టైట్ గా ఉన్న బాటిల్​ మూతలు తీయడానికి, బరువైన కుర్చీలు ఎత్తేందుకు” అని పేర్కొంది అనుష్క. కాగా అసోం, బిహార్​ రాష్ట్రాల్లో వరదల వ‌ల్ల‌ నష్టపోయిన ప్రజలకు బాస‌ట‌గా ఉంటామ‌ని కోహ్లీ- అనుష్క ఇటీవలే హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Read More :9 అడుగులకే ఖైరతాబాద్ మహా గణపతి.. ఈసారి మట్టితో..

Click on your DTH Provider to Add TV9 Telugu