
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, అన్ లాక్ 2 విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ సమావేశం అనంతరం మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైనప్పుడు.. కరోనా వైరస్ మహమ్మారిపై విస్తృతంగా చర్చలు జరిపాం. కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, కరోనా రోగులను నయం చేయడం, ఆర్ధిక కార్యకలాపాలను వృద్ధి చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.
During today’s meeting with CMs, we had wide ranging deliberations on the COVID-19 pandemic. Our focus areas are prevention of the infection, curing of patients and at the same time boosting economic activity. https://t.co/yt96HDyc9v
— Narendra Modi (@narendramodi) June 17, 2020