ఆరోగ్యంతోనే వికాసం, దేశ ప్రజలకు వెలుగులు విరజిమ్మే దీపావళి శుభాకాంక్షలు, ప్రధాని మోదీ

ఈ దీపావళి దేశంలో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ప్రధాని మోదీ అన్నారు. ఆరోగ్యంతోనే వికాసమని, ఆరోగ్యమే మహద్భాగ్యమనే నినాదమే స్ఫూర్తిమంతమని అంటూ ట్వీట్ చేశారు.

ఆరోగ్యంతోనే వికాసం, దేశ ప్రజలకు వెలుగులు విరజిమ్మే దీపావళి శుభాకాంక్షలు, ప్రధాని మోదీ

Edited By:

Updated on: Nov 14, 2020 | 11:24 AM

ఈ దీపావళి దేశంలో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ప్రధాని మోదీ అన్నారు. ఆరోగ్యంతోనే వికాసమని, ఆరోగ్యమే మహద్భాగ్యమనే నినాదమే స్ఫూర్తిమంతమని అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజును ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం మాదిరే మోదీ  దీపావళిని పురస్కరించుకుని శనివారం దేశ సైనికులతో ఈ పండుగ జరుపుకోనున్నారు. 2014 నుంచి దీన్ని ఆయన అలవాటుగా మార్చుకున్నారు. శనివారం ఆయన తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వెళ్ళవచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి . అయితే అదే సమయంలో రాజస్తాన్ లోని జైసల్మీర్ కు వెళ్లి అక్కడ ఘనంగా జరిగే ఫెస్టివల్ లో పాల్గొంటారని కూడా తెలుస్తోంది. అటు. వీర జవాన్లకు కూడా మోదీ దీపావళి శుభా కాంక్షలు అందజేశారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న సైనికులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.