Plank Challenge : ర‌వితేజ వెర్సస్ శ్రుతి హాస‌న్, ఎవరు గెలిచారో చూడండి..మాములు ఫన్ కాదు !

ర‌వితేజ, శ్రుతి హాస‌న్ జంటగా ప్రస్తుతం ‌'క్రాక్' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు...

Plank Challenge : ర‌వితేజ వెర్సస్ శ్రుతి హాస‌న్, ఎవరు గెలిచారో చూడండి..మాములు ఫన్ కాదు !

Updated on: Dec 07, 2020 | 4:03 PM

ర‌వితేజ, శ్రుతి హాస‌న్ జంటగా ప్రస్తుతం ‌’క్రాక్’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. గోవాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ర‌వితేజ‌, శృతిహాసన్ లపై  సాంగ్ చిత్రీకరించారు.  షూటింగ్ గ్యాప్ సమయంలో  రవితేజ, శ్రుతి హాసన్ సరదాగా ‘ప్లాంక్ చాలెంజ్’‌లో పాల్గొన్నారు.

ఎక్కువ పుషప్‌లు చేసిన వారే ఇందులో విజేతగా నిలుస్తారు. ఎప్పడూ‌ ఫిట్‌గా ఉండే రవితేజ శ్రుతిహాసన్‌పై గెలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సినిమా యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రవితేజ, శ్రుతిహాసన్ నవ్వుతూ ఇందులో పాల్గొన్నారు. కాగా ఇటీవలి కాలంలో మాస్ రాజా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యాడు. తన ప్రతి అప్‌డేట్ నెటిజన్లతో పంచుకుంటున్నాడు.  ఇక ‘క్రాక్’  మూవీ తర్వాత.. రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

Also Read :

విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన, 2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్

అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే