ఈఎస్ఐ భారీ స్కామ్‌లో మరోకరి అరెస్ట్.. ఈసారి ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి

| Edited By:

Oct 06, 2019 | 4:57 PM

కార్మికుల ఆరోగ్యబీమా సంస్ధ ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ స్పీడు పెంచింది. ఈఎస్ఐ డైరక్టర్ దేవికారాణి అరెస్టు తర్వాత ఈ స్కామ్ లో ఉన్న పాత్రదారులు ఒక్కక్కరిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై భారీ దోపిడీకి పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. గడిచిన నాలుగేశ్ళలో ఏడాది 250 కోట్ల రూపాయలు చొప్పున వేయికోట్ల రూపాయలు మందులు కొనుగోలు చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ భారీ కుంభకోణంతో లింక్ ఉన్న పలువురిపై ఉచ్చు బిగుస్తోంది. తాజాగా […]

ఈఎస్ఐ భారీ స్కామ్‌లో మరోకరి అరెస్ట్.. ఈసారి  ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి
Follow us on

కార్మికుల ఆరోగ్యబీమా సంస్ధ ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ స్పీడు పెంచింది. ఈఎస్ఐ డైరక్టర్ దేవికారాణి అరెస్టు తర్వాత ఈ స్కామ్ లో ఉన్న పాత్రదారులు ఒక్కక్కరిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై భారీ దోపిడీకి పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. గడిచిన నాలుగేశ్ళలో ఏడాది 250 కోట్ల రూపాయలు చొప్పున వేయికోట్ల రూపాయలు మందులు కొనుగోలు చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ భారీ కుంభకోణంతో లింక్ ఉన్న పలువురిపై ఉచ్చు బిగుస్తోంది.

తాజాగా ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని అరెస్టు చేశారు. నాగలక్ష్మి సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తోంది. అవసరం లేకపోయినా కోట్లాది రూపాయల మందులు కొనుగోలు చేసిన ఈ స్కామ్‌లో ఈమె పాత్ర కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌తో కలిసి నాగలక్ష్మి భారీ స్ధాయిలో అవినీతికి పాల్పడినట్టుగా తేలింది. ఈ భారీ స్కామ్‌లో ఇప్పటివరకు నాగలక్ష్మితో కలిపి 10 మందిని అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే ఈఎస్‌ఐ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలిసి లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్‌రెడ్డి అవినీతికి పల్పడినట్టు గుర్తించిన ఏసీబీ శనివారం అరెస్ట్ చేసింది. ఆయన పలువురు అధికారులతో కుమ్మక్కై రూ.8.25 కోట్ల మందులను కొనుగోలుకు సంబంధించి ఆర్డర్ సంపాదించారని నిర్ధారణైంది. ఇదే కేసులో ఆయనతో పాటు కీలకంగా వ్యవహరించిన ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరున్నారనే విషయాలను రాబడుతున్నారు.