వైద్యుల నియామకంపై ఉత్తర్వులు జారీ

|

Jul 22, 2020 | 5:46 AM

వైద్యుల నియామకంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో వైద్యుల నియామకానికి ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు కూడా జారీచేసింది.‌ మొత్తం 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో..

వైద్యుల నియామకంపై ఉత్తర్వులు జారీ
Follow us on

వైద్యుల నియామకంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో వైద్యుల నియామకానికి ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు కూడా జారీచేసింది.‌ మొత్తం 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని ప్ర‌భుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోగ‌ల‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో ఖాళీలను ఒప్పంద ప్రాతిప‌దిక‌న అరు నెల‌ల కాలానికి భ‌ర్తీ చేయాలని ఆదేశించింది.  పీజీ ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతున్న వైద్య విద్యార్థులను ఏడాది కాంట్రాక్ట్‌తో సీనియర్ రెసిడెంట్లుగా నియమించాల‌ని నిర్ణ‌యించింది.

మొత్తం 1,191 మందిని సీనియ‌ర్ రెసిడెంట్లుగా నియ‌మించి, వారికి నెలకు రూ.70 వేల చొప్పున‌ వేతనం చెల్లించనుంది. గాంధీ ఆస్ప‌త్రిలో- 250 మంది, కింగ్ కోఠి ఆస్ప‌త్రిలో 100 మంది, గచ్చిబౌలి టిమ్స్‌లో 150 మంది, చెస్ట్ ఆస్ప‌త్రిలో  50 మంది, ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 మంది చొప్పున మొత్తం 400 మంది, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు 241 మంది వైద్య విద్యార్థుల‌ను సీనియ‌ర్ రెసిడెంట్లుగా నియమించాలని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్న‌ది.