తెలంగాణ పీజీ విద్యార్ధులకు గుడ్ న్యూస్..!

|

Oct 15, 2020 | 6:51 PM

తెలంగాణలోని పీజీ విద్యార్ధులకు ఆరు యూనివర్సిటీలు గుడ్ న్యూస్ అందించాయి. కరోనా కారణంగా సొంతూర్లకు వెళ్ళిపోయిన విద్యార్ధులు తమ ప్రాంతాల్లోనే పరీక్ష రాసే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.

తెలంగాణ పీజీ విద్యార్ధులకు గుడ్ న్యూస్..!
Follow us on

తెలంగాణలోని పీజీ విద్యార్ధులకు ఆరు యూనివర్సిటీలు గుడ్ న్యూస్ అందించాయి. కరోనా కారణంగా సొంతూర్లకు వెళ్ళిపోయిన విద్యార్ధులు తమ ప్రాంతాల్లోనే పరీక్ష రాసే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో పీజీ కన్వెన్షనల్ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలు రాసేందుకు ఇప్పటికే వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓయూ పరిధిలో ఎగ్జామ్స్.. ఈ నెల 19వ తేదీ నుంచి మొదలు కానుండగా.. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు ఈ నెల 8న ప్రారంభం కావాల్సిందే.. వాయిదా పడ్డాయి. మిగిలిన యూనివర్సిటీలలో పరీక్షలను ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటివారంలో నిర్వహించనున్నారు. (Students Can Write From Their Own Districts)

కరోనా వల్ల హాస్టల్స్ ఇప్పట్లో తెరిచే పరిస్థితి కనిపించట్లేదు. సొంతూళ్ళకు వెళ్లి దూర ప్రాంతాలకు వచ్చి పరీక్ష రాయాలంటే.. సరైనా రవాణా లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన ఓయూ, కేయూ అధికారులు.. మిగిలిన యూనివర్సిటీల అధికారులతో చర్చించారు. ఎక్కడ ఉన్న విద్యార్ధులు.. అక్కడే వారి సొంత జిల్లాల్లో పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఓయూ పరిధిలో ఏటా ఏర్పాటు చేసే 80 పరీక్షా కేంద్రాలతో పాటు ఈసారి కొత్తగా మరో ఆరు సెంటర్లను పెంచారు. అటు వేరే యూనివర్సిటీల పరిధిలో కూడా 12 సెంటర్లను ఎంపిక చేశారు. వరంగల్​, ఖమ్మం, నిర్మల్​, మంచిర్యాల, మహబూబ్​నగర్​, వనపర్తి, నల్గొండ, కోదాడ, కరీంనగర్​, జగిత్యాల, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.

ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?