మా వ్యాక్సిన్ డాక్యుమెంట్లు యూరప్ లో హ్యాక్ అయ్యాయి, ఫైజర్, బయో టెక్ సంస్థలు

| Edited By: Pardhasaradhi Peri

Dec 10, 2020 | 3:57 PM

తమ వ్యాక్సిన్ క్యాండిడేట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు  యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సర్వర్ లో హ్యాక్ అయ్యాయని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు వెల్లడించాయి. సైబర్ దాడి సందర్భంగా..

మా వ్యాక్సిన్ డాక్యుమెంట్లు యూరప్ లో హ్యాక్ అయ్యాయి, ఫైజర్, బయో టెక్ సంస్థలు
Follow us on

తమ వ్యాక్సిన్ క్యాండిడేట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు  యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సర్వర్ లో హ్యాక్ అయ్యాయని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు వెల్లడించాయి. సైబర్ దాడి సందర్భంగా వాటిని చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసినట్టు ఈ కంపెనీలు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి సిస్టమ్స్ ఏవీ దెబ్బతినలేదని స్పష్టం చేశాయి. పర్సనల్ డేటా యాక్సెస్ అయిందో, లేదో తమకు తెలియదని ఫైజర్   అంటోంది. అలాగే ఈ డేటా యాక్సెస్ ద్వారా స్టడీ పార్టిసిపెంట్స్ ని గుర్తించారా లేదా అన్న విషయం తమకూ తెలియదని బయో ఎన్ టెక్ పేర్కొంది. కానీ ఈ సైబర్ ఎటాక్ తమ సమీక్షపై ఎలాంటి ప్రభావం చూపబోదని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది.

రెండు కోవిడ్ వ్యాక్సిన్లకు ప్రత్యేక అనుమతి అవసరమా అని నిర్ణయించడానికి కొన్ని వారాల ముందు తాము సైతం సైబర్ దాడి బాధితులమేనని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఈయూ మెడిసిన్స్ రెగ్యులేటర్ వెల్లడించింది. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో హ్యాకింగ్ కి సంబంధించి బ్రిటన్, స్పెయిన్ వంటి దేశాలు వేర్వేరు ఆరోపణలు చేశాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ పై రీసెర్చ్ నిర్వహించే ల్యాబ్ లపై రష్యాలోని క్రెమ్లిన్  అనుబంధ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారని బ్రిటన్ ఆరోపించగా… స్పెయిన్ కూడా తమ లేబొరేటరీలపై చైనా సైబర్ దుండగులు  ఎటాక్ లు చేశారని పేర్కొంది.  కాగా  ఇండియాలో తమ వ్యాక్సిన్ల  అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు పెట్టుకున్న దరఖాస్తులపై భారత కమిటీ ఒకటి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.