వరుసగా 21వ రోజు.. ‘పెట్రో’ ధరల మంట..

|

Jun 27, 2020 | 9:18 AM

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు పెంచాయి. పెట్రోల్ ధర లీటర్‌కు 25 పైసలు పెరగగా,  డీజిల్ ధర 21 పైసలు పెరిగింది.

వరుసగా 21వ రోజు.. పెట్రో ధరల మంట..
Follow us on

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు పెంచాయి. పెట్రోల్ ధర లీటర్‌కు 25 పైసలు పెరగగా,  డీజిల్ ధర 21 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38 చేరగా.. డీజిల్ రూ. 80.40కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 87.16కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.72కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.07 ఉండగా.. డీజిల్ రూ.75.56 ఉంది.

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.64 పెరగ్గా.. డీజిల్ రూ. 77.67కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 83.44కి చేరగా.. డీజిల్ రూ. 78.57కి చేరింది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.69కి పెరగగా.. డీజిల్ లీటర్ రూ. 78.79కి ఎగిసింది. కాగా, గత 21 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 9.18 పెరగగా, డీజిల్ లీటరుకు రూ. 10.28 పెరిగింది.

Also Read:

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?