గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లిన అభ్యర్థులు.. వారుంటున్న చోటే పరీక్షా కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటును కల్పించనుంది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఆగష్టులో నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. […]

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..
Follow us

|

Updated on: Jun 26, 2020 | 8:50 AM

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లిన అభ్యర్థులు.. వారుంటున్న చోటే పరీక్షా కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటును కల్పించనుంది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఆగష్టులో నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే లాక్ డౌన్ కారణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు వేరే ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాసే ఛాన్స్ లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. పరీక్షా కేంద్రాలను మార్చుకోవాలనుకునే అభ్యర్థులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి జులై 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఎగ్జామ్ సెంటర్లను మార్చుకోవచ్చునని పేర్కొంది.

కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ షెడ్యూల్‌ను సిద్ధం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??