మరోసారి స్వల్పంగా పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా.!

|

Jan 14, 2021 | 1:10 PM

Petrol Diesel Prices: దేశంలో గత కొన్నిరోజులుగా స్థిరంగా ఉన్న చమురు ధరలు.. వరుసగా రెండో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు...

మరోసారి స్వల్పంగా పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా.!
Follow us on

Petrol Diesel Prices: దేశంలో గత కొన్నిరోజులుగా స్థిరంగా ఉన్న చమురు ధరలు.. వరుసగా రెండో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచుతూ దేశీయ చమురు విక్రయ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి లీటర్ పెట్రోల్ ధర 84.70కి చేరింది. డీజిల్ ధర రూ. 74.63 నుంచి రూ. 74.88కి పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 91.32 ఉండగా డీజీల్‌ రూ. 81.60గా ఉంది. చెన్నైలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 87.40 ఉండగా డీజీల్‌ ధర రూ. 80.19గా ఉంది.

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.11గా ఉండగా.. డీజీల్‌ ధర 81.72గా నమోదైంది. ఇక వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.70 కాగా డీజీల్‌ 81.33గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 90.52 ఉండగా డీజీల్‌ రూ. 83.68గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 90.73 కాగా.. డీజీల్‌ ధర రూ. 83.85గా ఉంది. అటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.85 కాగా.. డీజిల్ రూ. 83.00కు చేరింది.