Side Effects of Ghee: నెయ్యి వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

|

Apr 23, 2022 | 4:24 PM

నెయ్యి(Ghee).. ఇది కొంత మందికి ఇష్టం ఉంటుంది.. మరి కొంత మందికి ఇష్టం ఉండదు. అయితే ఈ నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది...

Side Effects of Ghee: నెయ్యి వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
అందుకే వేసవి కాలంలో కూడా నెయ్యి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిమితంగా మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నారు.
Follow us on

నెయ్యి(Ghee).. ఇది కొంత మందికి ఇష్టం ఉంటుంది.. మరి కొంత మందికి ఇష్టం ఉండదు. అయితే ఈ నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవే మన శరీరానికి మంచివి. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు దీన్ని తినాలని సూచిస్తారు. అంతేకాదు నెయ్యి ఫుడ్ టేస్ట్‌ను కూడా పెంచుతుంది. నెయ్యిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ(Vitamin A), విటమిన్ ఇ, విటమిన్ కె(Vitamin K), ఒమేగా 9 ఫ్యాటీ ఆమ్లాలతో పాటుగా.. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలున్న నెయ్యి.. కొందరి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకో చూద్దాం..

బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు సర్వరోగాలు చుట్టుకునే ప్రమదం ఉంది. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారం సరైంది కానప్పుడే మన బాడీలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. గుండె జబ్బులతో బాధపడేవారు నెయ్యిని తింటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితిలో నెయ్యిని తినకపోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు సమస్యలున్న వారు నెయ్యిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిని తినడం వల్ల దగ్గు, జలుబు పెరుగుతాయి.

కాలేయ సమస్యలతో బాధపడేవారు నెయ్యిని గానీ, ఆయిల్ ఫుడ్స్ గానీ అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యిని తింటే ఈ సమస్య పెరుగుతుంది. అందుకే ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉంటే మంచిది.

Note: అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల పట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

 

Read Also.. Baby Food Diet: బేబీ ఫుడ్.. సెలబ్రిటీలు స్లిమ్‌గా ఉండటానికి కారణం ఇదేనట.. పూర్తి వివరాలివే..!