ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. అక్టోబర్ నెలలో కొత్తగా 64,880 మందికి రాష్ట్ర ప్రభుత్వం..

ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

Updated on: Oct 31, 2020 | 3:57 PM

November Pensions Distribution: నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. అక్టోబర్ నెలలో కొత్తగా 64,880 మందికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా మంజూరైన వాటితో కలిపి ఏపీ వ్యాప్తంగా మొత్తం 61.94 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేపట్టనున్నారు. కాగా, ఇప్పటికే ఫించన్ల పంపిణీ కోసం రూ.1499.89 కోట్లను జగన్ సర్కార్ విడుదల చేసింది. ఆదివారం గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ డబ్బును అందజేయనున్నారు.

Also Read: ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..

Follow Us