హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే బాదుడే!

వాహనదారుల రక్షణకోసం హెల్మెట్ ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు స్టాండర్డ్‌ మార్క్‌ హెల్మెట్లనే ధరించాలని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ స్పష్టం చేసింది.

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే బాదుడే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 9:10 AM

Penalties for Two wheeler Riders:  వాహనదారుల రక్షణకోసం హెల్మెట్ ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు స్టాండర్డ్‌ మార్క్‌ హెల్మెట్లనే ధరించాలని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ స్పష్టం చేసింది. బైక్‌లపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ విధిగా ఉండాలని, వాటికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ప్రమాణాలు లేకుంటే భారీగా జరిమానాలు విధించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఫేస్‌ షీల్డ్‌తోనే ప్రయాణాలు చేస్తున్నారని, ప్రమాదం జరిగితే ఫేస్‌ షీల్డ్‌ తలకు సరైన భద్రత కల్పించలేకపోతుందని అందులో పేర్కొన్నారు.