ఎకరానికి 35వేల నష్టపరిహారం.. చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. పవన్ కల్యాణ్ తాజా డిమాండ్

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎకరానికి 35వేల నష్టపరిహారం.. చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. పవన్ కల్యాణ్ తాజా డిమాండ్

Updated on: Dec 02, 2020 | 4:43 PM

Pawankalyan demands campansation and ex-gratia: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు కష్టాల్లో వుంటే పాలక, ప్రతిపక్షాలు శాసనసభలో బూతులు తిట్టుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు. వరదల కారణంగా పంటలను నష్టపోయిన రైతాంగాన్ని పవన్ కల్యాణ్ బుధవారం పరామర్శించారు. వరద తాకిడితో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘ తుఫాన్‌తో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు.. వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి.. ఎకరానికి 30 నుండి 35 వేలు ఆర్ధిక సహాయం చేస్తే కానీ వారికి న్యాయం జరగదు.. రైతులు కష్టాల్లో ఉంటే అసెంబ్లీలో కూర్చుని బూతులు తిట్టుకుంటున్నారు.. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇంటికి 10 వేలు చొప్పున 650 కోట్లు ఇచ్చారు.. 48 గంటల్లో నష్టపోయిన రైతులకు చెల్లించాలి.. నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం చెయ్యాలి.. ఎప్పుడో ఇస్తాం అని చెప్పడం కాదు.. సర్వేలు తరువాత చెయ్యండి.. తక్షణ సహాయం 10 వేలు ఇవ్వండి.. చనిపోయిన రైతులకు 5 లక్షలు ఎక్సగ్రెసియా ఇవ్వాలి.. ’’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

కౌలు రైతులను ప్రభుత్వం అదుకోకపోతే పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. మోపిదేవిలో సంగమేశ్వరం లాకుల సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పలు చోట్ల రైతులతో మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఆయన రైతాంగానికి హామీ ఇచ్చారు.

ALSO READ: శాసనసభలో తీవ్రమైన రగడ.. చంద్రబాబు వాకౌట్