అన్నయ్య చిరంజీవి సత్వరమే కోలుకోవాలని నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారని చెప్పారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. అన్నయ్య కరోనా బారినపడటంతో తామంతా విస్తుపోయామని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవలే ఆచార్య చిత్రీకరణను పున: ప్రారంభించాలనుకున్న చిరంజీవి కరోనా టెస్టులు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఎటువంటి లక్షణాలు లేవని చెప్పారు. తనను గత 4-5 రోజుల్లో కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు. హోం ఐసోలేషన్లోకి వెళ్తున్నట్లు తెలిపారు.
Also Read :