పవన్‌కు రాపాక మరో షాక్..

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన సీఎం జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి బేషరుతుగా మద్దతు ప్రకటిస్తున్నారు. జగన్ ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటున్నారని బాహాటంగానే ప్రశంశిస్తున్నారు. అంతేనా..! ఇప్పటికే రెండు సార్లు జగన్ ఫోటోకు వివిధ సందర్బాల్లో పాలాభిషేకం కూడా చేశారు. తాజాగా ఆయన మరో కీలక అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. పలు కీలక బిల్లులు అసెంబ్లీ పాసైనా […]

పవన్‌కు రాపాక మరో షాక్..

Updated on: Jan 27, 2020 | 6:53 PM

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన సీఎం జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి బేషరుతుగా మద్దతు ప్రకటిస్తున్నారు. జగన్ ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటున్నారని బాహాటంగానే ప్రశంశిస్తున్నారు. అంతేనా..! ఇప్పటికే రెండు సార్లు జగన్ ఫోటోకు వివిధ సందర్బాల్లో పాలాభిషేకం కూడా చేశారు. తాజాగా ఆయన మరో కీలక అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. పలు కీలక బిల్లులు అసెంబ్లీ పాసైనా కూడా..మండలిలో మెజార్టీ లేకపోవడంతో అవి వెనక్కి తిరిగి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మండలి రద్దును ప్రిపర్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై నేడు అసెంబ్లీ వేదికగా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో..రాపాక మండలి రద్దు సరైన నిర్ణయమే అంటూ జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. అభివృద్ది వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి అడ్డుకోవడం దురదృష్టకరమన్న రాపాక, ప్రజలకు మంచి చేసే బిల్లులను చంద్రబాబు మండలి సభ్యులతో అడ్డుకోవడం దారుణమన్నారు. కాగా ప్రతి అంశంపై కూడా జనసేన పార్టీ తరుఫున మద్దతు తెలుపుతానని రాపాక తన స్పీచ్‌ను ముగించడం గమనార్హం.