
Corona To Palle Raghunatha Reddy: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. రీసెంట్ గా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది.
Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే పల్లె రఘునాధ్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆయన కుటుంబం సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. కాగా, తనతో వారం రోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని.. వారం రోజుల్లో కరోనాను జయిస్తానని పల్లె రఘునాధ్ రెడ్డి తెలిపారు.
Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..