పాకిస్తాన్‌లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ మహిళ

| Edited By:

Sep 04, 2019 | 9:05 PM

పాకిస్తాన్‌లో పోలీస్ జాబ్ సాధించిన తొలి హిందూ మహిళగా ఓ యువతి రికార్డుల కెక్కింది. పుష్ఫ కొల్హి అనే అమ్మాయి సింధ్ పబ్లిక్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో.. ఏఎస్సైగా ఎంపికైంది. దీంతో.. పోలీస్ అధికారిగా సెలక్ట్‌ అయిన తొలి హిందూ.. యువతిగా అరుదైన రికార్డు సాధించింది. సింధూ ప్రావిన్స్‌లో పుష్ప కొల్హికి పోస్ట్ ఇచ్చింది పాక్ ప్రభుత్వం. దీంతో.. పలువురు హర్షం వ్యక్తం చేస్తూ.. పుష్పకు అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా, పత్రికలు స్వయంగా […]

పాకిస్తాన్‌లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ మహిళ
Follow us on

పాకిస్తాన్‌లో పోలీస్ జాబ్ సాధించిన తొలి హిందూ మహిళగా ఓ యువతి రికార్డుల కెక్కింది. పుష్ఫ కొల్హి అనే అమ్మాయి సింధ్ పబ్లిక్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో.. ఏఎస్సైగా ఎంపికైంది. దీంతో.. పోలీస్ అధికారిగా సెలక్ట్‌ అయిన తొలి హిందూ.. యువతిగా అరుదైన రికార్డు సాధించింది. సింధూ ప్రావిన్స్‌లో పుష్ప కొల్హికి పోస్ట్ ఇచ్చింది పాక్ ప్రభుత్వం. దీంతో.. పలువురు హర్షం వ్యక్తం చేస్తూ.. పుష్పకు అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా, పత్రికలు స్వయంగా వెల్లడించాయి.

మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాకిస్తాన్‌లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి మహిళా.. పుష్ప కొల్హి అరుదైన గుర్తింపు సాధించిందని అభినందిస్తూ.. ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. పాకిస్తాన్‌లో హిందువులు మైనార్టీ కమ్యునిటీగా ఉంటారు. ఇప్పటి లెక్కల ప్రకారం.. పాకిస్తాన్‌లో దాదాపు 75 లక్షల మంది హిందువులు అక్కడ నివసిస్తున్నారు. ఇక ఈ సంవత్సరంలోనే.. జనవరిలో సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్‌గా నియమితులై సంచలనం సృష్టించారు. ఇప్పుడు పుష్ప పోలీస్ అధికారిగా ఎంపికయ్యారు.