ఆరెస్సెస్‌‌కు నాజీలే స్ఫూర్తి..ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

|

Aug 12, 2019 | 6:05 AM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దుని విపరీతంగా వ్యతిరేకిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. బీజేపీ,  ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డారు. జర్మనీలో నాజీ సిద్ధాంతాలు, భావజాలంతో ఆరెస్సెస్‌ స్ఫూర్తి పొందిందని విమర్శించారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ, అణచివేత, సామూహిక హత్యలకు ఆ సంస్థ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని, జాతి హననం ద్వారా లోయను సర్వనాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్ […]

ఆరెస్సెస్‌‌కు నాజీలే స్ఫూర్తి..ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Follow us on

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దుని విపరీతంగా వ్యతిరేకిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. బీజేపీ,  ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డారు. జర్మనీలో నాజీ సిద్ధాంతాలు, భావజాలంతో ఆరెస్సెస్‌ స్ఫూర్తి పొందిందని విమర్శించారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ, అణచివేత, సామూహిక హత్యలకు ఆ సంస్థ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని, జాతి హననం ద్వారా లోయను సర్వనాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్ హిందూ జాతీయవాదం కేవలం కశ్మీర్ వరకే ఆగిపోదు. భారత్‌లోని ముస్లింలదరినీ వీళ్లు అణచివేస్తారు. చివరికి పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుంటారు. వీళ్లంతా హిట్లర్ జాతీయవాదానికి హిందూ వెర్షన్ లాంటివాళ్లు. ప్రపంచదేశాలు దీన్ని చూసిచూడనట్లు ఊరుకుంటాయా?’ అని ఇమ్రాన్ ప్రశ్నించారు.