ఎన్నికలపై ‘ఉగ్ర’ గురి

లోక్‌సభ ఎన్నికలపై ఉగ్రవాదుల కన్నుపడింది. ఎన్నికల సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. లష్కరే, జైషే తరహాలో పాకిస్థాన్ ఐఎస్ఐ, పలు ఉగ్ర సంస్థలను తయారు చేసిందని.. పోలింగ్ బూత్‌లే లక్ష్యంగా వారు ఉగ్రదాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థ పేర్కొంది. కశ్మీర్‌లో ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు సరిహద్దు నుంచి ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పంపొచ్చని ఐఎస్ఐ అనుమానాలు వ్యక్తం చేసింది. కాగా నిఘా వర్గాల సమాచారంతో జమ్ము కశ్మీర్‌లో బీఎస్ఎఫ్ […]

ఎన్నికలపై ‘ఉగ్ర’ గురి

Updated on: Apr 04, 2019 | 4:33 PM

లోక్‌సభ ఎన్నికలపై ఉగ్రవాదుల కన్నుపడింది. ఎన్నికల సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. లష్కరే, జైషే తరహాలో పాకిస్థాన్ ఐఎస్ఐ, పలు ఉగ్ర సంస్థలను తయారు చేసిందని.. పోలింగ్ బూత్‌లే లక్ష్యంగా వారు ఉగ్రదాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థ పేర్కొంది.

కశ్మీర్‌లో ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు సరిహద్దు నుంచి ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పంపొచ్చని ఐఎస్ఐ అనుమానాలు వ్యక్తం చేసింది. కాగా నిఘా వర్గాల సమాచారంతో జమ్ము కశ్మీర్‌లో బీఎస్ఎఫ్ దళాలతో పాటు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us