న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన తన పూర్తి సామర్ధ్యంతో విన్యాసాలు చేసింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ వాయుసేన విన్యాసాలతో పాకిస్థాన్‌కు తొలి హెచ్చరికను పంపినట్లైంది. పాక్ గుండెల్లో దడ పుట్టించనంత పని చేసింది. ఎంతో శక్తివంతమైన ఫ్లైటర్ జెట్లతో గగనతలంలో చక్కర్లు కొట్టి సమార్ధ్యాన్ని చాటాయి.
సరిహద్దులో బల ప్రదర్శన చేయడం ద్వారా పాక్‌కు గట్టి హెచ్చరిక చేసినట్టైంది. త్వరలో పాక్ ఉగ్రవాదంపై దెబ్బ కొట్టబోతున్న సంకేతాలా వెళ్లాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ 40 మంది భారత సీఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి.
ప్రధాని నరేంద్ర మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రకటించారు. జవాన్లు ప్రాణ త్యాగాలను వృధా కానివ్వమని వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరగే అవకాశం ఉందనే వార్తలు ఉపందుకున్నాయి. దీంతో భారత్ – పాక్ సారిహద్దులో జరిగిన వాయిసేనల విన్యాసాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.