ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులేదు: మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బిష్కెక్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉగ్రవాదంపై చర్చలు జరిగాయి. పాక్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయినందున చైనా ద్వారా పాక్‌కు భారత వైఖరిని సూటిగా తెలియజెప్పడం మోదీ ఉద్దేశం. ‘‘ఉగ్రవాద-రహిత వాతావరణాన్ని పాక్‌ సృష్టించాలి. అపుడే శాంతి చర్చల పునరుద్ధరణ సాధ్యం. కానీ పరిస్థితులను చూస్తుంటే పాక్‌ అలాంటి వాతావరణం ఏర్పరుస్తున్నట్లు మాకు అనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని అణచేందుకు పాక్‌ […]

ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులేదు: మోదీ

Edited By:

Updated on: Jun 14, 2019 | 7:19 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బిష్కెక్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉగ్రవాదంపై చర్చలు జరిగాయి. పాక్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయినందున చైనా ద్వారా పాక్‌కు భారత వైఖరిని సూటిగా తెలియజెప్పడం మోదీ ఉద్దేశం. ‘‘ఉగ్రవాద-రహిత వాతావరణాన్ని పాక్‌ సృష్టించాలి. అపుడే శాంతి చర్చల పునరుద్ధరణ సాధ్యం. కానీ పరిస్థితులను చూస్తుంటే పాక్‌ అలాంటి వాతావరణం ఏర్పరుస్తున్నట్లు మాకు అనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని అణచేందుకు పాక్‌ నిర్దిష్ట, పటుతరమైన చర్యలు తీసుకోవాలి.. తప్పదు’’ అని మోదీ జిన్‌పింగ్‌కు చెప్పినట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే మీడియాకు చెప్పారు.