ఆ సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ.. ఎందుకంటే..?

| Edited By:

Jan 27, 2020 | 6:01 PM

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 141 మందిని పద్మ అవార్డులతో సత్కరించారు. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ గౌరవం లభించాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిన్న (జనవరి 26) ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు చెందిన మొహమ్మద్ షరీఫ్ కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ గౌరవాన్ని ప్రసాదించారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో విధి వక్రించి అభాగ్యులుగా మరణిస్తున్న వారెందరో. […]

ఆ సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ.. ఎందుకంటే..?
Follow us on

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 141 మందిని పద్మ అవార్డులతో సత్కరించారు. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ గౌరవం లభించాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిన్న (జనవరి 26) ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు చెందిన మొహమ్మద్ షరీఫ్ కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ గౌరవాన్ని ప్రసాదించారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో విధి వక్రించి అభాగ్యులుగా మరణిస్తున్న వారెందరో. అలా నిరాదరణకు గురైన ఎంతో మంది అనాథ శవాలకు ఆసరాగా నిలుస్తున్నారు 82 ఏళ్ల షరీఫ్‌ చాచా. 27 ఏళ్లలో 25 వేల మంది అభాగ్యులకు దహనసంస్కారాలు నిర్వహించి వారికి మరణంలోనూ గౌరవాన్ని ప్రసాదించారు. అంతటి గొప్ప మనుసున్న చాచాని గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన నిస్వార్థ సేవకు సముచిత గౌరవం కల్పించింది.

షరీఫ్‌ చాచా 27 సంవత్సరాల క్రితం తన కొడుకును కోల్పోయాడు. అయితే.. నెల రోజుల తరువాత తన కొడుకు మరణం గురించి తెలుసుకున్నాడు. అప్పటి నుండి, షరీఫ్ అనాథ శవాలను దహనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. చాచా షరీఫ్ ఫైజాబాద్ పరిసరాల్లో 25 వేలకు పైగా అనాథ శవాలకు దహన సంస్కారాలను నిర్వహించారు. అతని నిస్వార్థ సేవ.. ప్రత్యేక లక్షణం ఏంటంటే, షరీఫ్ మతం ఆధారంగా ఎలాంటి వ్యత్యాసాలు చూపించకుండా.. మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన పద్ధతులకు అనుగుణంగా చివరి కర్మలను నిర్వహిస్తాడు.