పుల్వామా అమరులకు యాచకురాలి డబ్బులు విరాళం

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:56 PM

బతికిన్నంత కాలం యాచకురాలిగా గడిపిన ఓ మహిళ.. మరణించిన తరువాత దాతగా మారింది. ఆమె దాచుకున్న రూ.6.61లక్షలను పుల్వామా దాడిలో అమరులైన కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు ఇద్దరు నామినీలు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు చెందిన నందిని శర్మ అనే వృద్ధురాలు.. బజరంగఢ్‌లో యాచకురాలిగా ఉండేది. అక్కడ ప్రతిరోజు తనకు వచ్చే డబ్బును జమచేసుకోగా.. అది రూ.6.61లక్షలు అయింది. మరణానంతరం ఆ డబ్బును తీసుకునేందుకు వీలుగా ఇద్దరు వ్యక్తుల పేర్లను నామినిగా పేర్కొంది. గతేడాది ఆమె మరణించడంతో.. ఆ డబ్బును […]

పుల్వామా అమరులకు యాచకురాలి డబ్బులు విరాళం
Follow us on

బతికిన్నంత కాలం యాచకురాలిగా గడిపిన ఓ మహిళ.. మరణించిన తరువాత దాతగా మారింది. ఆమె దాచుకున్న రూ.6.61లక్షలను పుల్వామా దాడిలో అమరులైన కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు ఇద్దరు నామినీలు.

రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు చెందిన నందిని శర్మ అనే వృద్ధురాలు.. బజరంగఢ్‌లో యాచకురాలిగా ఉండేది. అక్కడ ప్రతిరోజు తనకు వచ్చే డబ్బును జమచేసుకోగా.. అది రూ.6.61లక్షలు అయింది. మరణానంతరం ఆ డబ్బును తీసుకునేందుకు వీలుగా ఇద్దరు వ్యక్తుల పేర్లను నామినిగా పేర్కొంది. గతేడాది ఆమె మరణించడంతో.. ఆ డబ్బును ఎవరికైనా విరాళంగా ఇవ్వాలని ఎదురుచూశారు నామినీలు.

ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలకు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆ డబ్బును ఇస్తే.. నందినీ శర్మకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అవుతుందని వారు భావించారు. దీంతో స్థానిక కలెక్టర్‌ను కలిసిన వారు ఆ డబ్బును అమర జవాన్లకు విరాళంగా ఇచ్చారు. దీని గురించి ఆ ఇద్దరు మాట్లాడుతూ.. ‘‘యాచకురాలిగా సంపాదించిన డబ్బంతా దేశానికి ఉపయోగపడాలని నందినీ శర్మ ఎప్పుడూ భావించింది. ఇప్పుడు ఆ డబ్బును అమర జవాన్లను అందించడమే ఉత్తమంగా మేము భావిస్తున్నాం’’ అంటూ వెల్లడించారు.