అర్థరాత్రి హాస్టల్‌లోకి ప్రవేశించి.. అమ్మాయితో..

| Edited By:

Aug 16, 2019 | 8:12 AM

ఓయూ లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులకు భద్రత కరువైంది. ఆర్థరాత్రి ఓ ఆగంతకుడు హాస్టల్‌లోకి ప్రవేశించి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. గురువారం అర్థరాత్రి సమయంలో హాస్టల్‌లోకి చొరబడిని గుర్తు తెలియని వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమెను కత్తితో బెదిరించాడు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆగంతకుడు ఓయూ లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అదే సమయంలో బాత్రూకని వెళ్లిన విద్యార్థినిని గమనించి.. బాత్రూం బయట గడి పెట్టి లోపల దూకాడు. కత్తితో […]

అర్థరాత్రి హాస్టల్‌లోకి ప్రవేశించి.. అమ్మాయితో..
Follow us on

ఓయూ లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులకు భద్రత కరువైంది. ఆర్థరాత్రి ఓ ఆగంతకుడు హాస్టల్‌లోకి ప్రవేశించి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. గురువారం అర్థరాత్రి సమయంలో హాస్టల్‌లోకి చొరబడిని గుర్తు తెలియని వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమెను కత్తితో బెదిరించాడు.

గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆగంతకుడు ఓయూ లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అదే సమయంలో బాత్రూకని వెళ్లిన విద్యార్థినిని గమనించి.. బాత్రూం బయట గడి పెట్టి లోపల దూకాడు. కత్తితో బెదిరిస్తూ.. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. మిగిలిని విద్యార్థినులు పరుగెత్తుకు వచ్చారు. అది గమనించిన దుండగుడు బాధితురాలి సెల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. ఘటనపై ఓయూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని సెల్ ఫోన్ ను హాస్టల్ ప్రహరి గోడ దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఇక ఆగంతకుడు ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.