రైలు ఎక్కాలంటే ఈ నిబంధ‌‌న‌లు త‌ప్ప‌నిస‌రి…

| Edited By: Pardhasaradhi Peri

May 12, 2020 | 4:35 PM

ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది పాసింజ‌ర్స్ రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. ఫ‌స్ట్ స్పెష‌ల్ ట్రైన్ న్యూ ఢిల్లీ స్టేషన్​ నుంచి మధ్యప్రదేశ్​లోని బిలాస్​పుర్​కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది. ఈ స్పెష‌ల్ ట్రైన్స్ టికెట్ బుకింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్టార్ట‌య్యింది. రానున్న ఏడు రోజులకు ఇప్పటి వరకు రూ.16.15 కోట్ల విలువైన 45,533 బుకింగ్​లు […]

రైలు ఎక్కాలంటే ఈ నిబంధ‌‌న‌లు త‌ప్ప‌నిస‌రి...
Follow us on

ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది పాసింజ‌ర్స్ రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. ఫ‌స్ట్ స్పెష‌ల్ ట్రైన్ న్యూ ఢిల్లీ స్టేషన్​ నుంచి మధ్యప్రదేశ్​లోని బిలాస్​పుర్​కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది. ఈ స్పెష‌ల్ ట్రైన్స్ టికెట్ బుకింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్టార్ట‌య్యింది. రానున్న ఏడు రోజులకు ఇప్పటి వరకు రూ.16.15 కోట్ల విలువైన 45,533 బుకింగ్​లు (పీఎన్​ఆర్​లు) అయ్యాయి. ఫలితంగా 82,317 మంది తమ సొంత ఊర్ల‌కు చేరుకోనున్నారు.

దాదాపు యాభై రోజుల విరామం తర్వాత రెగ్యులర్ పాసింజ‌ర్ రైళ్లు (15 ప్రత్యేక రైళ్లు) మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. ఈ రైళ్ల ప్రయాణానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని రైల్వేశాఖ అనౌన్స్ చేసింది. పాసింజ‌ర్స్ మెడిక‌ల్ టెస్టుల కోసం 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఫుడ్, వాట‌ర్ వెంట తెచ్చుకోవాలి. పాసింజ‌ర్స్ తమ మొబైల్​లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలి. కరోనా సంక్షోభం సమయంలో ఈ రైళ్లను నడుపుతున్నందు వల్ల స‌ర్టిఫైడ్ ఈ-టికెట్ ఉన్న పాసింజ‌ర్స్ మాత్రమే ఈ స్టేషన్లలోకి అనుమతిస్తారు. ప్రయాణికులు ఏడు రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఆర్​ఏసీ, వెయిటింగ్ లిస్ట్, ఆన్​బోర్డ్ బుకింగ్​లను అనుమతించరు.