AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా.. హెచ్-1 బీ వీసా రద్దుతో భారతీయులకు చిక్కులు

అమెరికాలో హెచ్ 1 బీ వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగిన అనేకమంది భారతీయులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడే పుట్టిన వారి పిల్లలను కూడా కష్టాలు వెన్నాడుతున్నాయి. హెచ్-1 బీ వీసా కార్డు రద్దు పెద్ద ఇబ్బందిగా మారింది. అమెరికాలోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిరిండియా విమానాలు సిధ్ధంగా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ లింక్ తో కూడిన ట్రావెల్ ఆంక్షల ఫలితంగా వారు స్వదేశానికి రాలేకపోతున్నారు. భారత ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన […]

అమెరికా.. హెచ్-1 బీ వీసా రద్దుతో భారతీయులకు చిక్కులు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 12, 2020 | 4:32 PM

Share

అమెరికాలో హెచ్ 1 బీ వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగిన అనేకమంది భారతీయులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడే పుట్టిన వారి పిల్లలను కూడా కష్టాలు వెన్నాడుతున్నాయి. హెచ్-1 బీ వీసా కార్డు రద్దు పెద్ద ఇబ్బందిగా మారింది. అమెరికాలోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిరిండియా విమానాలు సిధ్ధంగా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ లింక్ తో కూడిన ట్రావెల్ ఆంక్షల ఫలితంగా వారు స్వదేశానికి రాలేకపోతున్నారు. భారత ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన నిబంధనలను గతవారమే అప్ డేట్ చేసింది. ఈ మేరకు విదేశీయుల వీసాలు, ఓసీఐ కార్డులను తాత్కాలికంగా రద్దు చేస్తూ వీటిని రూపొందించారు. నిజానికి ప్రవాస భారతీయుల వీసా ఫ్రీ ట్రావెల్ ప్రివిలేజిలకు ఇవి ఉపయోగపడతాయన్న విషయం గమనార్హం. కానీ  అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కొత్త ఆంక్షలు విధించడం యుఎస్ లోని భారతీయులకు పెద్ద సమస్యగా మారింది. న్యూజెర్సీలో ఓ భార్యాభర్తల జంట హెచ్-1 బీ వీసా జాబ్ ను కోల్పోవడంతో చట్ట ప్రకారం 60 రోజుల్లోగా తిరిగి ఇండియాకు వచ్చేద్దామని అనుకున్నారు. తమ ఇద్దరు చిన్న పిల్లలతో వీరు నెవార్క్ విమానాశ్రయానికి చేరుకోగా.. వారి పిల్లలని ఎయిరిండియా అనుమతించలేదు. కారణం ఈ జంటకు ఇండియన్ వీసా ఉన్నప్పటికీ.. అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికన్లే అవుతారు గనుక ఆ పిల్లలను అనుమతించేది లేదని ఎయిరిండియా వర్గాలు స్పష్టం చేశాయట.. దీంతో ఆ చిన్న కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇంకా యుఎస్ లో అనేక భారతీయ జంటలు ఇలాగే  అయోమయంలో ఉన్నాయి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌.. ఈ రూట్లోనే..
సిబ్బంది డుమ్మాతో పారిశుద్ధ్య పనుల్లో ప్రజాప్రతినిధులు!
సిబ్బంది డుమ్మాతో పారిశుద్ధ్య పనుల్లో ప్రజాప్రతినిధులు!
ఇక పళ్ళు ఊడిపోయినా పర్లేదు.. సహజంగా తిరిగి పెంచేయొచ్చు! ఎలాగంటే..
ఇక పళ్ళు ఊడిపోయినా పర్లేదు.. సహజంగా తిరిగి పెంచేయొచ్చు! ఎలాగంటే..
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా..
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా..
హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC అదిరిపోయే 7 రోజుల టూర్
హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC అదిరిపోయే 7 రోజుల టూర్
రేషన్ బియ్యంతో చెక్క గారెలు.. ఎగబడి తినేస్తారు మీ పిల్లలు
రేషన్ బియ్యంతో చెక్క గారెలు.. ఎగబడి తినేస్తారు మీ పిల్లలు
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత