చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు

ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో చైనా యాప్స్ భారీ నిధులు మళ్లించినట్లు భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ మేరకు చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదయింది.

చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు

Updated on: Sep 20, 2020 | 3:35 PM

ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో చైనా యాప్స్ భారీ నిధులు మళ్లించినట్లు భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ మేరకు చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదయింది. ఉగ్రవాద కోణంలో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ పేరుతో చైనా యాప్‌లకు నిధుల మళ్లింపుపై ఎన్‌ఐఏ అధికారులు సీసీఎస్‌ నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నగదు చైనాకు తరలించిన కంపెనీలపై దర్యాప్తు చేపట్టాయి నిఘావర్గాలు. యాప్స్‌ పేరుతో భారతీయుల జేబులు గుళ్ల చేయడంతో పాటు, వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేన్తున్నారు. అనధికారికంగా వేల కోట్ల రూపాయలని చైనా కు తరలించినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ చైనా యాప్‌లపై ఈడీతో పాటు ఐటీ కూడా విచారణ చేస్తోంది.