తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..

|

Aug 20, 2020 | 4:45 PM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..
Follow us on

Internet In Government Schools: మాయదారి కరోనా వైరస్ అన్నింటిని మార్చేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం(2020-21) ఆలస్యం కాగా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.

తొలుత రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్  సౌకర్యం కల్పించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆన్లైన్ బోధన నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. దీని ద్వారా సుమారు 25 లక్షలు పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.

Also Read:

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..

మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..

డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..