సామాన్యులకు చిక్కనంటోన్న ఉల్లి

|

Nov 09, 2020 | 6:41 PM

కొండెక్కి కూర్చోన్న ఉల్లి ధర దిగనంటే దిగనంటుంది. ఇప్పటికే పలు రెస్టారెంట్లలో ఉల్లి బదులు కీర దోసను సర్వ్ చేస్తున్నారు. వంటల్లో కూడా ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. ఇంకో విషయం ఏంటంటే  కోడిగుడ్డు. ఉల్లిగడ్డ ఒకటయ్యాయి.

సామాన్యులకు చిక్కనంటోన్న ఉల్లి
Follow us on

కొండెక్కి కూర్చోన్న ఉల్లి ధర దిగనంటే దిగనంటుంది. ఇప్పటికే పలు రెస్టారెంట్లలో ఉల్లి బదులు కీర దోసను సర్వ్ చేస్తున్నారు. వంటల్లో కూడా ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. ఇంకో విషయం ఏంటంటే  కోడిగుడ్డు. ఉల్లిగడ్డ ఒకటయ్యాయి. సింగిల్ కోడిగుడ్డు ధర ఒకటి రూ.6 ఉంది. అదే ఉల్లిగడ్డల ధర కేజీ రూ.90 వరకు ఉంది. ఒక కిలోలో 15కు మించి ఉల్లిగడ్డలు రావడం లేదు. ఈ లెక్కన ఒక్క ఉల్లిగడ్డ ధర ఆరు రూపాయలు అన్నమాట. సిటీల్లో కిలో రూ.100 ఉంటే.. గ్రామాల్లో కిలోకు రూ.120గా అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వరదల ప్రభావమే ఉల్లి రేటు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. . ఉల్లిని నాసిక్‌, లాసల్‌గావ్‌, అకోల, తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఉల్లి దిగుబడులు తగ్గిపోయాయి. కొత్త పంట చేతికి రాకపోవడంతో కొరత ఏర్పడి..డిమాండ్ పెరిగింది. మరో పది రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read : 

వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం

కృష్ణా జిల్లాలో ఫేక్ ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్

వ్యవసాయం విలువ తెలుసు : సీఎం జగన్