తూర్పు గోదావరిలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..!

| Edited By: Srinu

Feb 03, 2020 | 1:19 PM

పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్‌ లీకైంది. భారీగా గ్యాస్‌ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఓఎన్జీసీ రిగ్‌ వద్ద చోటుచేసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యగా కిలోమీటరు పరిధిలోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఘటన జరిగిన ప్రదేశానికి 50 మీటర్ల దూరంలోనే కాట్రేనికోన మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఉండటంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ పైప్‌లైన్‌ లీకేజీ సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ […]

తూర్పు గోదావరిలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..!
Follow us on

పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్‌ లీకైంది. భారీగా గ్యాస్‌ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఓఎన్జీసీ రిగ్‌ వద్ద చోటుచేసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యగా కిలోమీటరు పరిధిలోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఘటన జరిగిన ప్రదేశానికి 50 మీటర్ల దూరంలోనే కాట్రేనికోన మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఉండటంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ పైప్‌లైన్‌ లీకేజీ సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ అధికారులకు చేరవేసింది. పైప్‌లైన్‌ నిర్వహణ బాధ్యతలను పీహెచ్‌ఎఫ్‌ అనే సంస్థకు ఓఎన్జీసీ అప్పగించింది. ఆ సంస్థ సిబ్బంది నిర్వహణ పనులు చేపడుతున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.