కేంద్ర‌ బడ్జెట్‌లో మహిళలకు పెద్ద పీట!

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:46 PM

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇది పేద, మధ్య తరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితుల […]

కేంద్ర‌ బడ్జెట్‌లో మహిళలకు పెద్ద పీట!
Follow us on

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇది పేద, మధ్య తరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.