Garuda Electric Cycle: ఓ వైపు రోజుకి రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. మరోవైపు వాహనాలు వెదజల్లే కాలుష్యంతో వాతావరణంపై పెను ప్రభావం చూపుతుంది. దీంతో ప్రత్యామ్న్యాయల పై ప్రభుత్వాలతో పాటు వాహనదారులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఎక్కువ మంది ఎలక్ట్రికల్ వాహనాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లోని అపీలు ఆటోమొబైల్ కంపెనీలు వినియోదారులను ఆకట్టుకోవడానికి వారి అభిరుచికి అనుగుణంగా వాహనాలను తయారీ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. అయితే ఎలక్రికల్ మోటార్ బైక్స్ ధరలు కొంచెం అందుబాటులో ఉండి.సామాన్యులకు కొంచెం భారం అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల దృష్టి.. ఎలక్రికల్ సైకిల్ పై పడింది. వారిని కొనుగోలు చేసేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నహాక్ మోటార్ సంస్థ.. సామాన్యులకు కోసం తక్కువ బడ్జెట్లో ఎలక్రికల్ సైకిల్ ను రూపొందించింది. గరుడ, జిప్సీ పేరుతో రెండు మోడళ్ళల్లో సైకిల్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ సైకిల్ ను మామూలు సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఎప్పుడైనా సైకిల్ ను తొక్కలేని పరిస్ధితుల్లో బ్యాటరీ సాయంతో ఈవీగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 40 కిలో మీటర్లు ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు అవుతుంది. ఈ ఎలక్రికల్ సైకిళ్ళ ధర . గరుడ మోడల్ ధర రూ. 31,999, కాగా జిప్సీ ధర రూ. 33,499 లు .
Also Read: Krishna on Kaliyug: కలియుగంలో మనిషి నడుకుచునే తీరుని పాండవులకు వివరించిన శ్రీకృష్ణుడు..