కాలువలోకి దూసుకుపోయిన వేగంగా వెళ్తోన్న మారుతి బాలెనో కారు.. ఒకరు మృతి. తూర్పుగోదావరిజిల్లాలో ఘటన
వేగంగా ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. దీంతో కారు ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స..
వేగంగా ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. దీంతో కారు ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తూర్పు గోదావరిజిల్లా మలికిపురం మండలం, టేకిశెట్టి పాలెం దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున మారుతి బాలెనొ కారు పెద్ద వంతెన పై నుండి అదుపు తప్పి కాలువలోకి వెళ్లిపోయింది. పెదలంక పెళ్లికి వెళ్లి, అంతర్వేది పాలెం తిరిగి వస్తుండగా ఈ ఘటన నెలకొంది. ఆ సమయంలో కారులో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే నక్కా హరీష్ (24) స్పొట్ లో మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.