ఒడిశాలో ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లు.. వయసునుబట్టి..

| Edited By:

Jul 05, 2020 | 1:14 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఒడిశాలో మధు బాబు పింఛన్ యోజన (ఎంబీపీవై) పరిథిలోకి

ఒడిశాలో ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లు.. వయసునుబట్టి..
Follow us on

Monthly pension to transgenders: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఒడిశాలో మధు బాబు పింఛన్ యోజన (ఎంబీపీవై) పరిథిలోకి ట్రాన్స్‌జెండర్లను చేర్చేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదం తెలిపారు. నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఈ పథకం క్రింద ఇప్పటి వరకు పింఛను పొందుతున్నారు. ఇకపై వీరితోపాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రతి నెలా పింఛను లభిస్తుంది.

రాష్ట్రంలో సుమారు 5 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరికి వయసునుబట్టి రూ.500 నుంచి రూ.900 వరకు పింఛను ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఒడిశా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అశోక్ పాండా మాట్లాడుతూ, మధు బాబు పింఛన్ యోజన (ఎంబీపీవై) పరిథిలోకి ట్రాన్స్‌జెండర్లను చేర్చాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదించినట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ప్రతి నెలా పింఛను పొందవచ్చునని పేర్కొన్నారు.