ఎమ్మెల్యేతో సహా మరో 10మందిని హతమార్చిన మిలిటెంట్లు

| Edited By:

May 21, 2019 | 6:51 PM

అరుణాచల్ ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో పది మందిని మిలిటెంట్లు హతమార్చారు. ఈ దారుణ ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. కోన్సా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన టిరాంగ్ అబోని వ్యవహరిస్తున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీటు నుంచి పోటీ చేశారు. అసోం నుంచి తిరుగి ఇంటికి వెళ్తుండగా.. నాగా మిలిటెంట్లు ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న […]

ఎమ్మెల్యేతో సహా మరో 10మందిని హతమార్చిన మిలిటెంట్లు
Follow us on

అరుణాచల్ ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో పది మందిని మిలిటెంట్లు హతమార్చారు. ఈ దారుణ ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. కోన్సా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన టిరాంగ్ అబోని వ్యవహరిస్తున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీటు నుంచి పోటీ చేశారు. అసోం నుంచి తిరుగి ఇంటికి వెళ్తుండగా.. నాగా మిలిటెంట్లు ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ఆ కారును అతని కుమారుడు డ్రైవ్ చేస్తున్నాడు. కాన్వాయ్‌పై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగడంతో.. ఎమ్మెల్యేతో పాటుగా మరో పది మంది ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ దాడిని మేఘాలయ సీఎం తీవ్రంగా ఖండించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని .. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఉగ్రదాడిలో అబో, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భద్రతా సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారని ఓ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.