మృగశిర ఆరంభంలోనే ‘ఆరుద్ర’.. విరివిగా వర్షాలు..

| Edited By:

Jun 09, 2020 | 12:50 PM

ఈ ఏడాది అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నేడో.. రేపో.. తెలంగాణాలో ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఖానాపూర్‌ అడవుల్లో ఆరుద్ర పురుగులు విరివిగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రకృతి నేస్తాలు ఏటా వర్షా కాలం ఆరంభంలో

మృగశిర ఆరంభంలోనే ‘ఆరుద్ర’.. విరివిగా వర్షాలు..
Follow us on

ఈ ఏడాది సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నేడో.. రేపో.. తెలంగాణాలో ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఖానాపూర్‌ అడవుల్లో ఆరుద్ర పురుగులు విరివిగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రకృతి నేస్తాలు ఏటా వర్షా కాలం ఆరంభంలో మృగశిర కార్తె ముగిసిన తర్వాత వచ్చే ఆరుద్ర కార్తెలోనే అరుదుగా కనిపిస్తుంటాయి.

కానీ. ఈ సారి రెండు వారాల ముందుగా మృగశిర ఆరంభంలోనే ఆరుద్ర కనిపించడంతో అన్నదాతలు పులకించిపోతున్నారు. వర్షాలు విరివిగా కురుస్తాయని, పంటలకు ఢోకా లేదని పల్లెల్లో వృద్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగులు తొలకరి జల్లులకు తడుస్తున్న నేలపై, అడవిలో చిగురిస్తున్న చెట్ల నీడన కదలాడుతూ ఆకట్టుకుంటున్నాయి.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ