BREAKING NEWS : ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ గెలుచుకున్నది వీరే..

|

Oct 12, 2020 | 4:18 PM

ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ 2020కుగాను ఇద్ద‌రు దిగ్గజాలు బ‌హుమ‌తిని గెలుచుకున్నారు. వేలం విధానంలో మార్పుల‌ను, నూత‌న వేలం విధానాల‌ను రూపొందించిన పౌల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ బీ విల్స‌న్‌ల‌కు ఎక‌నామిక్స్‌లో నోబెల్ పుర‌స్కారం వరించింది. స్టాక్‌హోమ్‌లో...

BREAKING NEWS : ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ గెలుచుకున్నది వీరే..
Follow us on

ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ 2020కుగాను ఇద్ద‌రు దిగ్గజాలు బ‌హుమ‌తిని గెలుచుకున్నారు. వేలం విధానంలో మార్పుల‌ను, నూత‌న వేలం విధానాల‌ను రూపొందించిన పౌల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ బీ విల్స‌న్‌ల‌కు ఎక‌నామిక్స్‌లో నోబెల్ పుర‌స్కారం వరించింది. స్టాక్‌హోమ్‌లో సోమవారం నోబెల్ క‌మిటీ ఈ అవార్డు విజేత‌ను ప్ర‌క‌టించింది. వేలం వేయ‌డం అనేది ప్ర‌తి చోట ఉంటుంద‌ని, అది మ‌న రోజువారి జీవితాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది.

పౌల్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ విల్స‌న్‌లు క‌నుగొన్న కొత్త వేలం విధానాల‌ వ‌ల్ల అమ్మ‌కందారుల‌కు, కొనుగోలుదారుల‌కు, ప‌న్నుదారుల‌కు లాభం చేకూరినట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. రేష‌న‌ల్ బిడ్డ‌ర్ల గురించి విల్స‌న్‌, బిడ్డింగ్‌లో పాల్గొన్న‌వారిలో ఉండే వ్య‌త్యాసాల గురించి పాల్ మిల్‌గ్రామ్ కొత్త ఫార్మాట్ల‌ను త‌యారు చేశారు. గ‌త ఏడాది ఆర్థిక‌శాస్త్రంలో ఈస్త‌ర్ డుఫ్లో, అభిజిత్ బెన‌ర్జీ దంప‌తులు నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న విష‌యం తెలిసిందే.