కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు

| Edited By:

Mar 11, 2020 | 3:43 PM

ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కుగా ఏర్పడింది. ఎందుకంటే.. హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం', హీరో రానా నటించిన 'అరణ్య' తమిళ వర్షన్ మూవీలు..

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు
Follow us on

తమిళ సినీ పరిశ్రమలో కలకలం చెలరేగింది. జీఎస్టీ ఎఫెక్ట్‌తో తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు చిక్కులను ఎదుర్కొంటుంది. మార్చి 27 నుండి తమిళనాడులో ఎటువంటి కొత్త సినిమాలను విడుదల చేయమంటూ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన 18 శాతం జిఎస్టీ కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుందని, ఇప్పుడు జిఎస్టీ కాకుండా సినిమా వలన లాభమో, నష్టమో తెలుసుకోకుండా వచ్చిన ఆదాయంలో 10 శాతం టీడీఎస్ కట్టమనడం దారుణమని తమిళ సినిమా డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు, దర్శకుడు టీ రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే.. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కుగా ఏర్పడింది. ఎందుకంటే.. హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’, హీరో రానా నటించిన ‘అరణ్య’ తమిళ వర్షన్ మూవీలు తమిళనాడులో కూడా రిలీజ్ కానున్నాయి. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలీక ఈ రెండు చిత్ర బృందాలు డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది.

కాగా జీఎస్టీ వల్ల సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోకపోతే తాము పూర్తిగా రోడ్డున పడతామని టీ రాజేందర్ అన్నారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మార్చి 27 నుంచి తమిళనాడులో ఎటువంటి కొత్త సినిమాలు విడుదల చేయబోమని ఆయన ప్రకటించారు. అలాగే ఇప్పటికే కేరళలో కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్స్‌‌ని ఈ నెల 31వరకూ మూసి వేయడంతో.. మోలీవుడ్‌కి కూడా చిక్కులు తప్పేలా లేవు.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది