ఢిల్లీలో పొడిగింపు లేదు.. రీజన్ ఇదే

|

Jun 12, 2020 | 12:28 PM

ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే యోచనేదీ లేదని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. దేశంలో కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలు రెండ్రోజులుగా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో..

ఢిల్లీలో పొడిగింపు లేదు.. రీజన్ ఇదే
Follow us on

ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే యోచనేదీ లేదని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. దేశంలో కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలు రెండ్రోజులుగా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ పొడిగింపు యోచనేదీ తమ ప్రభుత్వం వద్ద లేదని ప్రకటించారు.

దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు పది వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో మన దేశం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు కలిగి వున్న నాలుగో దేశంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాలో 20 లక్షల పాజిటివ్ కేసులు దాటడంతో అగ్రరాజ్యం మొదటి స్థానంలో వుంది. ఆ తర్వాత బ్రెజిల్, రష్యాలు రెండు, మూడు స్థానాలలో వుండగా మూడు లక్షలకు చేరువవుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ఇండియా నాలుగో స్థానానికి చేరింది.

ఇక దేశంలో పరిస్థితిని చూస్తే.. రాష్ట్రాలలో మహారాష్ట్ర , గుజరాత్, తమిళనాడు తొలి మూడు స్థానాలలో వుండగా.. నగరాల విషయానికి వస్తే ముంబయిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం తొలి స్థానంలో ముంబయి, రెండో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ వున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించే పరిస్థితి కనిపిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మళ్ళీ లాక్ డౌన్ పొడిగిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు.

ఒకవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు.. మరోవైపు నేతల ప్రకటనలు చూస్తే దేశంలో లాక్ డౌన్ అమల్లోకి వస్తుందన్న ఊహాగానాలకు తెరలేచింది. అయితే.. ఇప్పటికే 80 రోజులకు పైగా లాక్ డౌన్ వుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. మరింత కాలం లాక్ డౌన్ కొనసాగిస్తే పరిస్థితి చేయి దాటే పరిస్థితి వుంది. దానికి తోడు ఎంత కాలం లాక్ డౌన్ కొనసాగినా తిరిగి ఎత్తివేస్తే.. మళ్ళీ ఇదే పరిస్థితి తలెత్తే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రజలను అప్రమత్తం చేయడం.. కరోనా పరీక్షలను పెంచడం.. చికిత్సను వేగంగా అందించడం అనే వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు యోచన లేదంటూ అక్కడి ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారని భావిస్తున్నారు.