ఊరట నివ్వని బాంబేహైకోర్టు, సుప్రీంకోర్టుకెక్కిన అర్నాబ్ గోస్వామి

| Edited By: Pardhasaradhi Peri

Nov 10, 2020 | 2:47 PM

తనకు తాత్కాలిక బెయిలును మంజూరు చేయాలని, రెండేళ్ల నాటి కేసును తిరగదోడరాదని కోరుతూ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్లను బాంబేహైకోర్టు తోసిపుచ్చింది. ఆ కేసు అక్రమమని ఆయన పేర్కొన్నారు. అయితే తాము వీటిపై  ఎలాంటి ఉత్తర్వును ఇవ్వలేమని, బెయిలు కోసం పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చునని కోర్టు పేర్కొంది. నాలుగు రోజుల్లోగా దీనిపై తాము నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ను, […]

ఊరట నివ్వని బాంబేహైకోర్టు, సుప్రీంకోర్టుకెక్కిన అర్నాబ్ గోస్వామి
Follow us on

తనకు తాత్కాలిక బెయిలును మంజూరు చేయాలని, రెండేళ్ల నాటి కేసును తిరగదోడరాదని కోరుతూ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్లను బాంబేహైకోర్టు తోసిపుచ్చింది. ఆ కేసు అక్రమమని ఆయన పేర్కొన్నారు. అయితే తాము వీటిపై  ఎలాంటి ఉత్తర్వును ఇవ్వలేమని, బెయిలు కోసం పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చునని కోర్టు పేర్కొంది. నాలుగు రోజుల్లోగా దీనిపై తాము నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ను, ఆయన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలు అర్నాబ్ గోస్వామిపై ఉన్నాయి. కాగా… పోలీసులు ఆయనను రోజూ మూడు గంటలపాటు విచారించడానికి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనుమతించారు.