ఐఏఎస్ ట్రైనీ శ్రీకాంత్ రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శేషాద్రిణి రెడ్డిలు అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రిజిస్ట్రేషన్ ఫీజు, దండల ఖర్చుతో చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు ఒక్కటయ్యారు. తమ స్థాయికి తగిన భారీ వేడుకలకు బదులుగా, ఈ దంపతులు సాదాసీదాగా పెళ్లి చేసుకుని అనేక మందికి స్ఫూర్తినిచ్చారు.