Good News: ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!
Good News From AP Government: ఏపీ మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 31వ తేదీ, జనవరి 1న మద్యం దుకాణాలు
Good News From AP Government: ఏపీ మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 31వ తేదీ, జనవరి 1న మద్యం దుకాణాలు, బార్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. గత కొద్దిరోజులుగా ఈ నెల 31వ తేదీ, అలాగే జనవరి 1న ఏపీలో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధిస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిది ఏమి లేదని.. ఆయా రోజుల్లో యధావిధిగా మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకోనున్నాయని వెల్లడించింది. డిసెంబర్ 31, జనవరి 1న ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు మద్యం దుకాణాలు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు బార్లు, రెస్టారెంట్లు పని చేస్తాయని వెల్లడించింది. అలాగే కొత్త సంవత్సరం వేడుకలు సందర్భంగా పని వేళల్లో కూడా ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
Also Read:
యాంటీ బయోటిక్స్ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట
‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్