Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ జట్టును వీదనున్న విలియమ్సన్.? క్లారిటీ ఇచ్చిన డేవిడ్ వార్నర్..
Sunrisers Hyderabad Team: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున కేన్ విలియమ్సన్ ఆడడని.. జట్టును వీడనున్నట్లు గత కొద్దిరోజులుగా...
Sunrisers Hyderabad Team: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున కేన్ విలియమ్సన్ ఆడడని.. జట్టును వీడనున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వాటినన్నింటినీ తాజాగా సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కొట్టిపారేశాడు. ‘సైడర్ ట్రేడింగ్ ద్వారా కేన్ విలియమ్సన్ మరో జట్టులోకి వెళ్తున్నాడా.? ఇది నిజమేనా.? దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ డేవిడ్ వార్నర్‌ను ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా అడిగాడు..
”ఈ విషయం నా దృష్టికి వచ్చింది. కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ జట్టును వదిలి ఎక్కడికీ వెళ్ళడు” అని వార్నర్ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. కాగా, ఐపీఎల్ 2020లో వార్నర్, విలియమ్సన్ నిలకడైన ఆటతీరు కారణంగా సన్‌రైజర్స్ జట్టు మూడో స్థానంలో నిలిచిన విషయం విదితమే.
Also Read:
యాంటీ బయోటిక్స్ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట
‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్
First I have heard of this. Kane will not be going anywhere https://t.co/FokAQLJsmC
— David Warner (@davidwarner31) December 22, 2020