ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ దారుణ హత్య, బీహార్ లో నితీష్ ప్రభుత్వానికి ఇరకాటం, రాజీనామాకు విపక్షాల డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2021 | 6:55 PM

బీహార్ లో ఇండిగో ఎయిర్ పోర్టు మేనేజర్ రూపేష్ కుమార్ సింగ్ దారుణ హత్య రాజకీయంగా పెను కలకలం రేపింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్...

ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ దారుణ హత్య, బీహార్ లో నితీష్ ప్రభుత్వానికి ఇరకాటం, రాజీనామాకు విపక్షాల డిమాండ్
Follow us on

బీహార్ లో ఇండిగో ఎయిర్ పోర్టు మేనేజర్ రూపేష్ కుమార్ సింగ్ దారుణ హత్య రాజకీయంగా పెను కలకలం రేపింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి కూతవేటు దూరంలోనే దుండగులు కాల్చి చంపారు. రూపేష్ కుమార్ ఇల్లు సీఎం నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎయిర్ పోర్టులో  కార్గో విమానం నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అన్ లోడ్ చేయించి తన నివాసానికి చేరుకున్న 44 ఏళ్ళ  రూపేష్ కుమార్ పై …బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు  కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రూపేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ దారుణ హత్యకు దారి తీసిన కారణాలు తెలియలేదు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని విపక్ష ఆర్జేడీ….ఇతర పార్టీలు ఆరోపిస్తుండగా..వీటితో బీజేపీ నేతలు కొందరు కూడా గళం కలిపారు. నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. మీ నివాసానికి ఇంత దగ్గరలోనే ఈ ఘటన జరగడం ఆందోళనకరమని ఆయన అన్నారు. మీ పోలీసు వ్యవస్థ పనిచేయలేని. చేవలేని వ్యవస్థ అని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు కొంతమంది కూడా ఈ ఘటన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ హత్యను ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం వినియోగించుకోజూస్తున్నాయని ఈ పార్టీ ఎంపీ వివేక్ ఠాకూర్ అన్నారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు కొద్దీ రోజుల్లోనే తేల్చి దుండగులను అరెస్టు చేయాలని, లేదా దీన్ని సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ కి అప్పగించాలని ఆయన సూచించారు.

ఇలాగే రాజ్యసభ సభ్యుడు గోపాల్ నారాయణ్ సింగ్.. కూడా అసలు ముఖ్యమంత్రికి లా అండ్ ఆర్డర్ పై కంట్రోల్ లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మా పార్టీ మద్దతుతో నడుస్తోందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Read Also:జీవితాన్ని త్యాగం చేస్తున్నా..టిక్రి బోర్డర్ లో లాయర్ ఆత్మహత్య, రైతుల వాణిని ప్రధాని మోదీ వినాలంటూ సూసైడ్ నోట్
Read Also:Vijayawada Mumbai Flight: జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై మధ్య ‘ఇండిగో’ విమాన సర్వీసులు..